నా కష్టాలు మీకు ఎఫెక్ట్ అయ్యాయా? నామినేషన్స్ లో కీర్తి కన్నీళ్లు!

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది.కొట్లాటలు,అరుపులు, ఏడుపులతో రంజుగా సాగుతోంది.

ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 18 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

కాగా మొదటివారం ఎలిమినేషన్ లేదు అంటూనే రెండవ వారం ఏకంగా ఇద్దరినీ షాని, అభినయశ్రీ ని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మూడవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయింది.

ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం నామినేషన్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు బిగ్ బాస్ షో నిర్వాహకులు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఒకరు ఎవరైనా ఇద్దరు కంటెస్టెంట్ ల తలపై టమోటా రసాన్ని పిండి వారిని ఎందుకు నామినేట్ చేయాలి అనుకుంటున్నారో కారణాన్ని వివరించాలి అని ఆదేశించాడు బిగ్ బాస్.

ఈ క్రమంలోనే మాటలతో ఈ టాస్క్ మరింతరంగా సాగింది.ఈ క్రమంలోనే ఒక్కొక్క కంటెస్టెంట్ వారికి నచ్చని కంటెస్టెంట్ ల తల పై టమోటా రసం పిండి వారిని నామినేట్ చేశారు.

ఈ క్రమంలోనే కీర్తి భాగోద్వేగానికి గురైంది. """/"/ అప్పుడు కీర్తి మాట్లాడుతూ ఈ మూడు వారాల్లో నా ఆట ఎక్కడ తక్కువగా అనిపించింది అని ప్రశ్నించగా.

వెంటనే ఆది రెడ్డి మాట్లాడుతూ.నాగార్జునసాగర్ చెప్పినది ఎవరి గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటునది అనడంతో కీర్తి నవ్వుతుంది.

ఇంతలోనే రేవంత్ ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి ఆ బాధలు పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేస్తే అని అంటుండగా ఇంతలోనే కీర్తి బాధ,బాధ అంటూ బాధలు తీసుకురాకండి అని గట్టిగా అరుస్తుంది.

బాధ ఉంటే నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చే దాన్ని కాదు అని అంటాడంతో అందరూ షాక్ అవుతారు.

అలాగే నా బాధల వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అయ్యిందా అని రేవంత్ రెడ్డి ని నిలదీస్తుంది కీర్తి.