బాబు కి ఇంటెలిజెన్స్ షాక్.. దిమ్మతిరిగిపోయే రిపోర్ట్ అందజేత
TeluguStop.com
తెలుగుదేశం పార్టీ పరిపాలన బ్రమ్మాండంగా ఉందని ప్రజలు అనుకంటున్నారు.చక్కటి ప్రజాకర్షక పథకాలతో ప్రభుత్వం దూసుకుపోతోంది.
ఇక మాకు తిరుగే లేదు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి మేము రెడీ అని ధీమాగా చెప్తున్న చంద్రబాబుకు ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది.
బాబు అనుకుంటున్నంతగా ఏమీ లేదని క్షేత్ర స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉందని, సంక్షేమ పథకాలు ఏవీ అర్హులకు సక్రమంగా అందడంలేదని, కేవలం నాయకులు సూచించినవారే లబ్ధిపొందుతున్నారే తప్ప సాధారణ ప్రజలు వాటిని పొందాలంటే అది సాధ్యమే కావడం లేదు.
గ్రామస్థాయి నుంచి కూడా నాయకుల పెత్తనం మితిమీరిపోయింది.ఆ వ్యతిరేకత ప్రభుత్వంపై తీవ్రంగా ఉంది అంటూ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ బాబు కి రిపోర్ట్ అందజేసింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
పార్టీని, ప్రభుత్వాన్నిపరుగులుపెట్టించి మరీ ప్రజలకోసం కష్టపడుతుంటే సర్వ్ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా రావడంతో బాబు ఆందోళన చెందుతున్నాడు.
ఇంటిలిజెన్స్ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన తాజా సర్వేపై సర్వత్రా చర్చ జరుగుతోంది.మరి ఇంతకీ అధికారులు చంద్రబాబుకు ఇచ్చిన నివేదిక ఏంటీ ? దాని సారాంశం ఏంటీ? అనేది రాష్ట్రంలో ఆసక్తిగా మారింది.
వాస్తవానికి చంద్రబాబు నెలకు రెండు దఫాలుగా సర్వే చేయించుకుంటున్నారు.కానీ, తాజాగా చేసిన సర్వే, దాని తాలూకు ఫలితాలు ఆయనను తీవ్ర నిరాశలోకి నెట్టేసింది.
ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా గతంలో కూడా ప్రభుత్వం సర్వే నిర్వహించింది.పింఛను వస్తోందా? రేషన్‌కార్డు ఉందా ? బూత్ స్థాయిలో బలమైన నాయకులు ఎవరు ? వారిని ప్రభావితం చేసే వారు ఎవరు ? లాంటి అంశాలతో సర్వే చేపట్టింది.
దీనికోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా రెండు నెలల పాటు ప్రభుత్వం ఉపయోగించుకుంది.ఇప్పుడు మరోసారి 66 ప్రశ్నలతో రాజకీయ కోణంలో సర్వే చేయడం, అందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించి నివేదికలు తెప్పించింది.
ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్ చేప్పట్టిన సర్వే ద్వారా తేలింది ఏంటంటే.రాష్ట్రంలో ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగడంలేదని.
సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా అధికార పార్టీ నేతలు చెప్పినవారికే దక్కుతున్నాయని ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారని సర్వేలో వెల్లడైంది.
దీనిపై నష్ట నివారణ చర్యలకు దిగాలని బాబు ఆలోచన చేస్తున్నాడు.ప్రజలు చెబుతున్న సమస్యలు ఏమిటి? వాటి ద్వారా ఖజానాపై పడే ఆర్థిక భారం ఎంత? అనే వివరాలను కూడా ఇంటెలిజెన్స్ నివేదికలో పొందుపరుస్తున్నట్లు సమాచారం.
తద్వారా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, రాజధాని నిర్మాణం లాంటి హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చి తాత్కాలిక చర్యలతో వ్యతిరేకత తగ్గించుకోవాలని బాబు ప్లాన్.
అలాగే సర్వేలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటున్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు ఈ సరి టికెట్ ఇచ్చేది లేదని, వాళ్ళ మీద జాలిపడి తన పీకల మీదకు తెచ్చుకోలేను అని బాబు చెప్పేస్తున్నాడు.
వీడియో: కొమోడో డ్రాగన్ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే కళ్లు తేలేస్తారు!