షాకింగ్.. సెల్ఫీ కోసం సాహసం.. చివరకు..!
TeluguStop.com
ఇప్పటి యువతకు సెల్ఫీ లు అంటే మోజు.ఏదైనా కొత్త డ్రెస్ వేసుకుంటే చాలు.
చేతిలో ఫోన్ తీసుకుని రకరకాల ఫోజులు పెట్టి మరి సెల్ఫీ లు దిగుతారు.
ఎప్పుడో ఒకసారి ఫోటోలు దిగితే తప్పులేదు.కానీ అదే వ్యసనంగా మారితే ప్రమాదం తప్పదు.
రోజు పేపర్లోనో, టివి లోనో సెల్ఫీ దిగుతూ ప్రాణాలు విడిచారు అని వస్తూనే ఉన్న కూడా ఇప్పటి యువతి పట్టించు కోవడం లేదు.
"""/"/
ఇప్పటికే ఈ సెల్ఫీ మోజులో పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టు కున్నారు.
అయినా యువతలో ఎటువంటి మార్పు రావడం లేదు.కొంతమంది అచ్చం సెల్ఫీ తీసుకోవడం కోసమే రెడీ అవుతూ ఉంటారు.
సెల్ఫీలు దిగి దిగి అది ఒక వ్యసనంగా మారిపోతుంది.మాములు సెల్ఫీలు దిగితే ప్రాణాలకు ప్రమాదం ఉండదు కానీ కొంతమంది ఆ సెల్ఫీలు కోసం ఎక్కడెక్కడికో వెళ్లి సాహసాలు చేసి మరి సెల్ఫీలు తీసుకుంటుంటారు.
అలంటి సెల్ఫీలు దిగడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే.తాజాగా సోఫియా అనే మోడల్ హాంకాంగ్ లో సెల్ఫీ తీసుకుంటూ చనిపోవడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆమె ఎప్పుడు సాహసాలు చేస్తూ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా మరొక సహస భరిత ఫోటో కోసం ఏకంగా ఆమె ప్రాణాలనే పణంగా పెట్టింది.
"""/"/
సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన సోఫియా అక్కడ ప్లేస్ బాగుండడంతో సెల్ఫీ దిగుదాం అనుకుంది.
అయితే మాములుగా కాకుండా సాహసం చేద్దామని అనుకుంది.అక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గర సెల్ఫీ దిగేందుకు వెళ్లడంతో అక్కడ బాలన్స్ తప్పి ఆ ప్రవాహంలో పడిపోయింది.
అన్నిహితులు చూసి వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది.అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్స్ తెలిపారు.
దీంతో ఆమె మృతి పట్ల అందరు సంతాపం తెలుపుతున్నారు.
164 అడుగుల లోయలో పడిపోయిన ప్రెగ్నెంట్ టీచర్… చివరికేమైందో తెలిస్తే?