ఇన్‌స్టాగ్రాంలో మీకు నచ్చని వారిని ఎలా మ్యూట్ చేయాలో తెలుసా?
TeluguStop.com
ఫేస్‌బుక్ యాజమాన్యంలో నడుస్తున్న ఇన్‌స్టాగ్రాం ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితమే! ఎక్కువ శాతం డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో మూడోస్థానంలో ఉంది ఇన్‌స్టా.
ఇది గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రాం తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ముఖ్యంగా ఫోటో షేరింగ్ యాప్‌లో వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఇన్‌స్టాగ్రాం తరచూ అనేక ఫీచర్లను తీసుకువస్తుంది.
ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త ఫీచర్ ద్వారా యూజర్ సులభంగా కాంటాక్ట్‌ను మ్యూట్ చేయగలుగుతారు.
దీంతో వారు యూజర్ పోస్ట్‌లను, టైంలైన్‌లను చూడటానికి వీలుండదు.ఆ వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా ఇన్‌స్టాగ్రాంలో ఒకవ్యక్తిని అన్‌ఫాలో అవ్వడం వేరు .మ్యూట్ చేయడం వేరు.
ఇన్‌స్టాగ్రాంలో స్టోరీస్ మ్యూట్ చేయడం వల్ల సదరు వ్యక్తికి ఈ విషయం తెలియదు.
కాబట్టి మీరు బ్లాక్ చేయాలనుకున్న కాంటాక్ట్‌ను కేవలం మ్యూట్ చేస్తే సరిపోతుంది.లేకపోతే సదరు వ్యక్తి మీ ప్రోఫైల్‌ను పరిశీలించవచ్చు.
అప్పుడు మీరు అతడిని అన్ ఫాలో అవుతున్న విషయం తెలిసిపోతుంది.కాబట్టి అన్‌ఫాలో అవ్వకుండా.
ఈజీగా మ్యూట్ ఆప్షన్‌ను ఎంకోవాలి.h3 Class=subheader-styleమీకు నచ్చని కాంటాక్టును ఎలా మ్యూట్ చేసే విధానం.
/h3p """/"/
దీనికి మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఇన్‌స్టాగ్రాం యాప్‌ను ఓపెన్ చేయాలి.ఆ తర్వాత మీరు మ్యూట్ చేయాల్సిన ప్రోఫైల్‌ను వెతికి, దాన్ని మ్యూట్ చేయాల్సిన ప్రోఫైల్‌ను ఎంచుకోవాలి.
ఫాలోయింగ్‌పై క్లిక్ చేసి, అందులో మూడు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి.మ్యూట్, రిస్ట్రిక్ట్, అన్‌ఫాలో.
అందులో మ్యూట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి.సదరు కాంటాక్ట్ నంబర్ ద్వారా మీకు కావాల్సిన పోస్టులను మ్యూట్ చేయవచ్చు.
స్టోరీస్ ఆప్షన్‌ను ఎంచుకుని అన్నీ మ్యూట్ చేయవచ్చు.టిక్‌టాక్ మన దేశంలో బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రాంకు ఆధారణ మరింత పెరిగింది.
వినియోగదారులను ఆకట్టుకుంటూ.తమ పోటీ యాప్‌లకు దీటుగా ఇన్‌స్టాగ్రాం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?