అసంపూర్తి గా ఉన్న గదుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను కాంగ్రెస్ నాయకులు ఆదివారం పరిశీలించారు.

గత విద్యా సంవత్సరం ఎల్లారెడ్డిపేట కు మహాత్మా జ్యోతిభా పూలే డిగ్రీ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం అట్టి డిగ్రీ కళాశాల అద్దె భవనంలో కొనసాగుతుంది.

కాగ అట్టి అద్దె భవనంకు విముక్తి కల్పించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అసంపూర్తిగా బెస్ మేట్ నిర్మాణంతో ఉన్న తరగతి గదులను వారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,తాజా మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్,గంట రమేష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.

ప్రేరణకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన హరితేజ.. మాటలు సక్కగా మాట్లాడంటూ!