అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మత్తు పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా :అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన మరమ్మత్తు పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు.

కోనరావుపేట మండలం కొలనూర్ లోని జడ్పీ ఉన్నత పాఠశాల లో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద చేపట్టిన మరమ్మత్తు పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆ పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

స్కూల్ లో విద్యార్థుల సంఖ్య ఎంత? బడి బాటలో కొత్తగా ఎన్ని ప్రవేశాలు జరిగాయో అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కోనరావుపేట లోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లాలు, ఇతర పనులను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

అక్కడి నుంచి ధర్మారం రాంనగర్ లోని స్కూళ్ళో చేపట్టిన మరమ్మత్తు పనులను పరిశీలించారు.

చరణ్ పక్కన ఉన్న ఈ లేడీ ఎవరో గుర్తుపట్టారా.. చెబితే తప్ప నమ్మలేరంటూ?