నిమ్మపల్లి గ్రామపంచాయతీలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఆధ్వర్యంలో రికార్డుల తనిఖీ!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కోనరావుపేటమండలం నిమ్మపల్లి గ్రామంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్( పౌర మానవ హక్కుల సంస్థ) ఆధ్వర్యంలో నిమ్మపల్లి( Nimmapalle ), గ్రామపంచాయతీ కార్యాలయం రికార్డులు ఆర్టిఐ యాక్ట్ -2005 సెక్షన్ 2(j)(i),2(j)(ii)2(j)(iii)2(j)(iv) ప్రకారం తనిఖీ చేయడం జరిగింది.

సంస్థ సభ్యులు సెంట్రల్ కమిటీ మెంబర్ భూక్యా చరణ్ కాంత్, రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్ సెక్రెటరీ నేవూరి రత్నాకర్ ఆర్టిఐ యాక్ట్ 2005 ప్రకారం గ్రామ నిధులు ఖర్చులు వివరాల రికార్డుల పరిశీలనకు 03మే 2023 సంవత్సరంలో దరఖాస్తు చేయగా గ్రామ పంచాయతీ సెక్రెటరి 31 మే 2023 రోజున రికార్డు తనిఖీలకు అనుమతి ఇస్తూ నోటీసు ఇవ్వడం జరిగింది.

బుధవారం, గురువారం, రెండు రోజులలో సెంట్రల్ కమిటీ సభ్యుడు భూక్యా చరణ్ కాంత్, ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ చేయడం జరిగింది.

పరిశీలించిన రికార్డుల వివరాలను సంస్థ సభ్యులు మరోసారి శునితంగా పరిశీలించి ఏమైనా తప్పులు,అవినీతి,అక్రమాలు జరిగినట్లు తేలితే ఇట్టి విషయంపై రిపోర్టును తయారుచేసి మండల, జిల్లా, రాష్ట్ర,భారత ప్రభుత్వ పంచాయతీశాఖ పైస్థాయి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని సంస్థ సభ్యులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల వరకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ ఆక్ట్) పై అవగాహన మరియు అవినీతి నిర్మూలన, సామాజిక అభివృద్ధి, అలాగే చట్టాలపై అవగాహన కోసం స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి ఒక్క భారతీయ పౌరునికి రికార్డులు తనిఖీ చేసే హక్కు ఉంది అని తెలియజేయడమే సంస్ధ ప్రధాన లక్ష్యం అని తెలియజేయడం జరిగింది.

రికార్డులు పరిశీలనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ( Telangana ) సంస్థ సభ్యులు సెంట్రల్ కమిటీ మెంబర్ సిహెచ్ శ్రీనివాస్, బి చంద్రకాంత్ , డి శ్రీనివాస్, ఈ బాలకిషన్, వేణు, సలీం, ప్రశాంత్, సాయికుమార్, జి సుధాకర్, సంతోష్ లు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?