సమంత ఇంట్లో 6 లగ్జరీ కార్లు.. వాటి ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

సమంత ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పుష్పసినిమా లో సమంత ఐటెం సాంగ్ చేసి అందరి చేత శబాష్ అనిపించు కుంది.

ఈమె విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ విడాకుల తర్వాత మాత్రం వరుస సినిమాలు అంగీకరిస్తూ మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది.

టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.

ఇక ఈమె ఫ్యాషన్ లో ఎంత ట్రెండింగ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్ ను ఫాలో అవుతూ ఉంటుంది.ప్రెసెంట్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచింది.

సామ్ ఈ సినిమాతో పాటు రెండు ద్విభాషా చిత్రాలను కూడా లైన్లో పెట్టింది.

తర్వాత ప్రాజెక్ట్ యశోద షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసింది.అలాగే ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఈమె చేతిలో ఉంది.

దీంతో సామ్ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.రానున్న రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం లేకపోలేదు.

అయితే తాజాగా ఈమె గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. """/"/ ఈమెకు ఆరు లగ్జరీ కార్లు ఉన్నాయట.

వీటి ఖరీదు తెలిసి అంతా షాక్ అవుతున్నారు.ఈమె గత కొన్నేళ్లుగా స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది.

ఈమె ఏ డ్రెస్ వేసిన లక్షల్లో ఉంటుంది.అలాగే ఈమె ఎంతో కొంత డబ్బు కూడబెట్టింది.

కొంత డబ్బును కార్లపై కూడా పెట్టింది. """/"/ సమంతకు స్వాంకీ పొర్చే కేమన్ కారు ఉంది.

ఇది 1.46 కోట్ల విలువ చేస్తుంది.

అలాగే 72 లక్షల విలువ చేసే జాగ్వార్ ఎక్స్ ఎఫ్, 1.42 కోట్ల విలువ చేసే మెర్సిడీస్ బెంజ్ కారు, 83 లక్షల విలువ చేసే ఆడి క్యూ 7 కారు, 2.

26 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు కూడా ఉన్నాయి.ఇలా ఈమె దగ్గర అంత ఖరీదు అయినా కార్లు ఉన్నాయని తెలియడంతో అంతా షాక్ అవుతున్నారు.