కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు సేకరించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలతో పాటు మహదేవపురం పీఎస్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.
మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రజాధనాన్ని వృధా చేసిన వారిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.