బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.

ఈ మేరకు కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారించనుంది.

తన చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ లో కోర్టును కోరారు.

ఈ క్రమంలోనే గత నెల 26న ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.

"""/" / అయితే కవితకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ను ఈడీ( ED ) వ్యతిరేకిస్తుంది.

కవిత బెయిల్ పై బయటకు వస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పేర్కొంది.

సాక్షులను, ఆధారాలను ఆమె ప్రభావితం చేస్తారని ఈడీ ఆరోపిస్తుంది.కాగా ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

దేవర విషయం లో ఎన్టీయార్ ను భయపెడుతున్న అనిరుధ్…