స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయింపుపై విచారణ

స్వతంత్ర అభ్యర్థులకు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఏపీ హైకోర్టులో ( AP High Court )విచారణ జరిగింది.

గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులు ఎవరికీ కేటాయించొద్దని కోరుతూ జనసేన( Janasena ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.ఈ క్రమంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును ఇవ్వలేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.

ఒకవేళ ఇచ్చినా మారుస్తామని ఈసీ వెల్లడించింది.అయితే జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల మినహా మిగతా ప్రాంతాల్లో గాజు గ్లాసు గుర్తును ఈసీ ఫ్రీ సింబల్ లిస్టులో ఉంచిన సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయిన కూడా సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా..?