గురుకుల ఘటనపై విచారణ:ఆర్డీవో

నల్లగొండ జిల్లా:దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో 25 మంది విద్యార్దినిలు శనివారం రాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను ఆదివారం మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ పరామర్శించారు.

పాఠశాలలో ఏం జరిగిందని వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ జరిపించనున్నట్లు తెలిపారు.

తన రెమ్యునరేషన్ తో రికార్డ్ క్రియేట్ చేసిన బన్నీ.. పారితోషికం తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!