పీవోపీ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై టీఎస్ హైకోర్టులో విచారణ

పీవోపీ గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు గత సంవత్సరం ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గతేడాది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

పీవోపీ విగ్రహాలను కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశాలు ఇచ్చింది.గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్ ను ధర్మాసనం విచారించింది.

ఈ క్రమంలోనే కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని పిటిషనర్లు కోరారు.గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్ లో గణేశ్ ల నిమజ్జనం చేశారన్న న్యాయవాది వేణుమాధవ్ పేర్కొన్నారు.

దీంతో ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

బీఆర్ఎస్ లో ఈ మార్పులు… ఇక తీరుగులేదా ?