టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంలో విచారణ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ కేసులోని ముగ్గురు నిందితులు తమకు హైకోర్టు రిమాండ్ విధించడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు.

అయితే, రాజకీయాల కోసం కోర్టులను వేదిక చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

నిందితుల బెయిల్ కేసులు కింది కోర్టులో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించారు.

ఏపీ, తెలంగాణ కేసులన్నీ రాజకీయపరంగానే ఉంటాయని జస్టిస్ గవాయి వ్యాఖ్యనించారు.అనంతరం తదుపరి విచారణను సుప్రీం సోమవారానికి వాయిదా వేసింది.

ఆ ఎన్నికలపై వైసిపి సైలెన్స్ ? పరువు పోతుందనా ?