విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్రం నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది.

సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై.ఆయన తరఫు న్యాయవాది బాలాజీ హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆర్టికల్ 21కు విరుద్ధమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.స్టీల్ ప్లాంట్ కోసం వేలమంది రైతుల నుంచి 22 వేల ఎకరాలు సేకరించారని,.

9,200 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని తెలిపారు.మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని కోర్టుకు నివేదించారు.ప్రైవేటీకరణకు బదులు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ప్రతిపాదించామని తెలిపారు.

ఇరు ప‌క్షాల వాదనలు విన్న హైకోర్టు.కేంద్రం, ఆర్ఐఎన్ఎల్, రాష్ట్ర ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ లను కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

అనంత‌రం తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసింది.