ఆర్-5 జోన్ కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ

ఆర్-5 జోన్ కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా భూ బదలాయింపు చేసే అధికారం సీఆర్డీఏకు లేదని పిటిషనర్ తెలిపారు.

ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

కోర్టు ఇళ్ల పట్టాలు మాత్రమే ఇవ్వాలని చెప్పిందన్న న్యాయమూర్తి ఇళ్ల నిర్మాణం చేపట్టమనలేదు కదా అని ప్రశ్నించింది.

అనంతరం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీకి వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

లడ్డూ వివాదం : ఆ ముగ్గురికి షర్మిల విజ్ఞప్తి