ఆ ఊర్లో వినూత్నంగా పోలీసుల పనీష్మెంట్... ఎలాగంటే?

ప్రస్తుతం కరోనా దేశ వ్యాప్తంగా విజ్రుంభిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుండటం, కరోనా మరణాల రేటు పెరుగుతుండటం ప్రజల్లో భయందోలనలు రేకెత్తిస్తోంది.

దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

అయితే ఇప్పుడు లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

పోలీసులు ప్రజలకు ఎంత విజ్ఞప్తి చేస్తున్నా కొంత మంది మాత్రం పోలీసుల సూచనలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

దీంతో పోలీసులు సహజంగా ఏం చేస్తారు కఠినంగా ప్రవర్తించి లాటీలకు పని చెబుతారు.

కాని మధ్యప్రదేశ్ లో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు వినూత్నంగా శిక్షలను అమలుచేస్తున్నారు.

అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పోలీసులు శిక్షలను అమలు చేస్తున్నారు.అయితే మధ్యప్రదేశ్ లో నిబంధనలు ఉల్లంఘించిన వారికి డైరీలోని ఒక పేజీ నిండా బొట్టు పెట్టి రామనామాన్ని రాయిస్తున్నారు.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.నెటిజన్లు పోలీసులు శిక్షలు ఇలా కూడా అమలు చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా చేస్తే నిబంధనలు ఉల్లంఘించే వారు మారతారా అంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !