కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం జరిగింది..: మంత్రి అంబటి

కృష్ణా జలాల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

తెలంగాణ ఎక్కువ నీటిని వాడుకుందని తెలిపారు.టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే నీటి పంపకాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి అంబటి ఆరోపించారు.

శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో, సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.

నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు.చంద్రబాబు రైతు ద్రోహిగా వ్యవహరించారని మంత్రి అంబటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మోహన్ బాబు తన కొడుకుల విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నాడు…