స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం.. ఈ స్టార్ హీరో త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్!
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) తన సినిమాల కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.అయితే స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయం( Prabhas Leg Injury ) అయినట్టు తెలుస్తోంది.
ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ప్రభాస్ కు గాయం అయినట్టు సమాచారం అందుతోంది.
డాక్టర్ల సూచనల ఆధారంగా ప్రభాస్ రెస్ట్ తీసుకుంటున్నారని భోగట్టా.కల్కి సినిమా( Kalki Movie ) త్వరలో జపాన్ లో విడుదల కానుండగా అక్కడి ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనాల్సి ఉన్నా కాలికి అయిన గాయం వల్ల ప్రభాస్ ప్రమోషన్స్ కు దూరంగా ఉండనున్నారు.
ప్రభాస్ తన పోస్ట్ లో నాపై ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
జపాన్ లోని ఫ్యాన్స్ ను కలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చారు.కానీ అభిమానులు నన్ను క్షమించాలని ప్రభాస్ తెలిపారు.
"""/" /
మూవీ షూట్ లో భాగంగా నా కాలికి చిన్న గాయం కావడంతో నేను రాలేకపోతున్నానని ప్రభాస్ అన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
వచ్చే ఏడాది ప్రభాస్ ది రాజాసాబ్,( The Rajasaab ) కన్నప్ప( Kannappa ) సినిమాలతో పాటు ఫౌజీ( Fauji ) సినిమాలతో బిజీ గా ఉన్నారు.
"""/" /
ప్రభాస్ సినిమాలు బిజినెస్, కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
ఏడాదికి రెండు సినిమాలలో నటించేలా ప్రభాస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ తర్వాత సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
ప్రభాస్ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్న ప్రభాస్ ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాల్సి ఉంది.
మంచు మనోజ్ కు షాకిచ్చేలా లేఖ రాసిన తల్లి.. ఈ హీరో ఒంటరివాడు అవుతున్నాడా?