ప్రారంభమైన కోతలు ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల( Penpahad Mandal ) పరిధిలో యాసంగి కోతలు మొదలై 10 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు.
ఇదే అదునుగా మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకపోగా తేమ,తరుగు పేరుతో రెండు మూడు కేజీలు కట్ చేస్తూ దోపిడి చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
\ప్రభుత్వ మద్దతు ధర రూ.2,203 ఉండగా మిల్లర్లు క్వింటాల్ కు రూ.
1600 నుండి రూ.1850 వరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని,దీంతో ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు( Farmers ) భారీగా నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో: 24 గంటల్లోనే 101 మందితో శృంగారం.. ఆ అనుభవం గురించి ఆమె చెప్పిందేంటంటే..?