నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో అమానుష ఘటన

స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవడంతో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.డాక్టర్ ను కలిసేందుకు రెండో అంతస్తుకు తీసుకెళ్లాల్సి రావడంతో రోగిని ఈడ్చుకెళ్లారని తెలుస్తోంది.

స్ట్రెచ్చర్ కానీ వీల్ చైర్ కానీ అందుబాటులో లేకపోవడంతో ఆ విధంగా తీసుకెళ్లారని వాదనలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న  ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.