అక్రమ నగదు నిల్వల పై ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, బంగారు ఇతర విలువైన ఆభరణాలు , విలువైన వస్తువుల నిలువ లేక రవాణా గురించి సమాచారం తెలిస్తే వెంటనే ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల ప్రయోజనం కోసం నిల్వ/ రవాణా/ పంపిణీ చేయబడిన నగదు బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా కలిగి ఉంటే వెంటనే 18004251788 అనే ఆదాయప్పను టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా 040-23426201/23426202 ల్యాండ్ లైన్ నెంబర్ లేదా +91-8688701400 వాట్సాప్ నెంబర్ లేదా Cleantelanganaelections@incometax.

Gov!--in అనే మెయిల్ ఐడి కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

వీడియో వైరల్: ఫోన్ ఇవ్వనందుకు తల్లిని బ్యాట్ తో చావబాదిన కొడుకు!