Indraja : దయచేసి మమ్మల్ని ఆ పనికి వాడుకోవద్దు.. మగవాళ్లపై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోయిన్ల( Tollywood Senior Heroines )లో ఒకరైన ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.
ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోవడంతో మరీ భారీ రేంజ్ లో అయితే ఆఫర్లు రావడం లేదు.
అయితే ప్రస్తుతం బుల్లితెర షోలతో బిజీగా ఉన్న ఇంద్రజ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) ప్రోమోలో బూతులు తిట్టడానికి మగవాళ్లు ఆడవాళ్లను అడ్డం పెట్టుకోవద్దని ఆమె కోరారు.
మగవాళ్లు మగవాళ్లు కొట్టుకుంటే మీ పేర్లతోనే కొట్టుకోవాలని ఆడవాళ్లను లాగవద్దని ఆమె కోరారు.
కొంతమంది గొడవ పడే సమయంలో ఆడవాళ్ల గురించి లాగుతూ బూతులు తిట్టడంతో ఆమె ఈ కామెంట్లు చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. """/"/
ఇంద్రజ( Indraja ) చేసిన కామెంట్లను నెటిజన్లు సైతం సమర్థిస్తున్నారు.
గత కొన్నేళ్లలో పరిస్థితులు ఎంతో మారినా ఆడవాళ్లను ఇంకా చులకనగా చూసే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.
అలాంటి పరిస్థితులు మరింత మారాల్సి ఉంది.ఇంద్రజ ప్రస్తుతం ఈటీవీలో వరుస షోలతో సందడి చేయడంతో పాటు కొన్ని సందర్భాల్లో డ్యాన్స్ కూడా చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.
"""/"/
నటిగా మంచి గుర్తింపు ఉండగా ఆమె నటించిన సినిమాలు మరీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంద్రజ వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తూ( Indraja Young Look ) అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలా ఉన్నారని అభిమానులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఇంద్రజకు కెరీర్ పరంగా మరింత కలిసొస్తుందేమో చూడాలి.తెలుగు బాగా మాట్లాడే నటి కావడం ఇంద్రజకు మరో ప్లస్ అయింది.
ఎవరైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం ఆమె తన వంతు సహాయం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
వైరల్: ఇది చూశారంటే ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి దండం పెడతారు!