మహిళలే మగాళ్లను పోషిస్తున్నారు.. వైరల్ అవుతున్న ఇంద్రజ సంచలన వ్యాఖ్యలు!

తక్కువ సంఖ్యలో సినిమాల్లోనే నటించినా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఇంద్రజకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఇంద్రజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఒక సందర్భంలో ఇంద్రజ మగాళ్ల గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయనే చెప్పాలి.

మహిళలు మగవాళ్లపై ఆధారపడుతున్నారని ఇప్పటికీ కొన్ని యాడ్స్ లో చూపిస్తున్నారని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

అయితే రియాలిటీలో పరిస్థితి మాత్రం మరో విధంగా ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా లేక అంతకు మించి సంపాదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

మహిళలే మగాళ్లను పోషిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఆడవాళ్లు తమ సమస్యలను అర్థం చేసుకోవాలని మగవాళ్లను పదేపదే అడగడం వృథా అని ఆమె అన్నారు.

"""/" / మన సమస్యలను మనమే భరిస్తూ ఉంటే మాత్రమే మగవాళ్లు అర్థం చెసుకుంటారని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ లో మగవాళ్ల మెంటాలిటీ పని చేస్తుందని ఆమె అన్నారు.

గుర్తింపు దక్కలేదని బాధ పడవద్దని మీ గురించి మీరే అర్థం చేసుకోకపోతే మగవాళ్లు అర్థం చేసుకోవాలని భావించడం ఎంతవరకు కరెక్ట్ అని ఇంద్రజ అభిప్రాయపడ్డారు.

"""/" / నెలసరి గురించి చర్చించడానికి మొహమాటపడవద్దని మహిళలను అర్థం చేసుకునే మగవాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందని ఆమె తెలిపారు.

నచ్చిన విధంగా జీవించాలని ఎస్ చెప్పాల్సిన సమయంలో ఎస్ చెబుతూ నో చెప్పాల్సిన సమయంలో నో చెప్పాలని ఆమె కామెంట్ చేశారు.

ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.ఇంద్రజను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

ఆమె నవ్వుకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.ఇంద్రజ కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మా సమస్యలు పరిష్కరించండి .. సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కోరిన కన్నడ ఎన్ఆర్ఐలు