ఎవరి దిష్టి తగిలిందో అంటూ కంటతడి పెట్టిన జబర్దస్త్ జడ్జ్.. ప్రోమో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గత ఎనిమిది ఏళ్ల నుండి ఈ షో మంచి ఆదరణతో ముందుకు కొనసాగుతుంది.

ఇక ఇందులో ఎంతో మంది కమెడియన్ లు తమ కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని మరో స్థాయిలో వెలిగిపోతున్నారు.

వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు.ఇక ఈ షోలో మొన్నటి వరకు రోజా జడ్జిగా చేసిన సంగతి తెలిసిందే.

రోజా జడ్జ్ గా మంచి మార్కులు సంపాదించుకోగా ఇటీవలే తనకు మంత్రి పదవి రావటంతో జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయింది.

ఇక ఆ స్థానంలో మరో నటి ఇంద్రజ చేరి ఆమె కూడా బుల్లితెర ప్రేక్షకులను తన వైపు మలుపుకుంది.

మొదట ఈమె షో కి గెస్ట్ గా రాగా ఆ తర్వాత జడ్జిగా బాధ్యతలు చేపట్టింది.

మొదట శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో జడ్జిగా బాగా అలరించింది.అంతే కాకుండా అక్కడ సుడిగాలి సుధీర్ తో మంచి అనుబంధాన్ని పెంచుకుంది.

సుధీర్ కూడా ఇంద్రజ ను అమ్మలాగా పోల్చుకునే వాడు.అలా వీరిద్దరి మధ్య తల్లీకొడుకుల ట్రాక్ బాగానే నడిచింది.

ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ లోనే కాకుండా.జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కూడా జడ్జిగా కనిపిస్తుంది.

అక్కడ కూడా తన మాటలతో అందర్నీ తనవైపు మలుపుకుంది.కానీ తన కొడుకు లాంటి సుధీర్ ను మిస్ అవుతున్నట్లు కనిపించింది.

ఇంతకాలం ఆ విషయం బయట పెట్టలేదు కానీ తాజాగా విడుదలైన ప్రోమో లో ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరి దృష్టిని తాకాయి.

"""/" / సుడిగాలి సుధీర్ ఇతర ప్రాజెక్టులలో బిజీగా ఉండడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ షో తో పాటు జబర్దస్త్ షో లో నుండి కూడా బయటకు వచ్చేసాడు.

ఇక గెటప్ శ్రీను కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో ఈ టీం లో ఆటో రాంప్రసాద్ ఒక్కడిగా మిగిలిపోవటంతో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు.

"""/" / తాజాగా విడుదలైన ప్రోమో లో ఆటో రాంప్రసాద్ వీళ్లిద్దరు లేనందుకు ఎంతగా ఫీల్ అవుతున్నాడు అనేదాన్ని మరో కమెడియన్ స్కిట్ చేసి చూపించాడు.

దీంతో ఆటో రాంప్రసాద్ బాగా ఎమోషనల్ అయ్యాడు.వాళ్ళిద్దరు వెళ్లిపోవడంతో తాను ఒంటరిని అయ్యాను అంటూ బాధపడ్డాడు.

ఇక ఇంద్రజ కూడా సుధీర్ ని తలుచుకొని.ఎవరి దిష్టి తగిలిందో.

మీకు నాకు.ఇలా అయ్యింది అంటూ కన్నీరు పెట్టుకుంది ఇంద్రజ.

ఆ ప్రోమో వైరల్ గా మారడంతో ఆ వీడియో చూసిన వారంతా నిజంగా సుధీర్ లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అని.

సుధీర్ అన్న ఎలాగైనా తిరిగి రా అంటూ కామెంట్లు పెడుతున్నారు.నిజానికి బుల్లితెరపై సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

అతి తక్కువ సమయంలో ఆయన ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.