ఇంద్రగంటితో దేవరకొండ సినిమా ఎలా ఉండబోతుంది

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాని కరణ్ జోహార్ చార్మీతో కలిసి నిర్మిస్తున్నాడు.బాక్సింగ్ నేపధ్యంలో సినిమా ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాల షెడ్యూల్ ఈ ఏడాది ఫుల్ బిజీగా ఉంది.

చాలా మంది దర్శకులు అతనితో సినిమా కోసం రెడీగా ఉన్నారు.ఇక నిర్మాతలు కూడా వరుసగా అడ్వాన్స్ లు ఇచ్చి ఉన్నారు.

ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది అనే టాక్ ప్రస్తుతం అన్డుస్తుంది.

తాజాగా దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి అతనిని విష్ చేశారు.ఈ ఏడాది నువ్వు మంచి సినిమాలు ఇంకా చేయాల్సి ఉంది.

నువ్వు చేసే అద్భుతాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశారు.దీనికి బదులుగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ థ్యాంక్స్, నాకు తెలుసు అయితే ఆ అద్భుతం మనమిద్దరం కలిసి చేయబోతున్నాం అని ట్వీట్ చేశారు.

దీంతో వీరిద్దరి కాంబినేషన్ లోనే నెక్స్ట్ సినిమా ఉండబోతుంది అనే మాట ఇప్పుడు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.

అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే టాక్ కూడా ఇప్పుడు నడుస్తుంది.

థ్రిల్లర్ కథలు చేయడంలో దేవరకొండ బేసిక్ గా ఆసక్తి చూపిస్తాడు.అలాగే కామెడీని కూడా పండిస్తాడు.

ఈ నేపధ్యంలో వీరి కలయికలో వచ్చే సినిమా థ్రిల్లర్ కామెడీలో ఉండే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

వి సినిమా రిలీజ్ తర్వాత దేవరకొండతో సినిమాని ఇంద్రగంటి ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

మెగా ఫ్యామిలీకి దక్కిన సంచలన రికార్డ్ ఇదే.. ఈ రికార్డ్ ను ఎవరూ బ్రేక్ చేయలేరుగా!