స్వరం పెంచిన ఇండో అమెరికన్స్...మూలుగుతున్న వ్యాక్సిన్లు భారత్ కు ఇవ్వండి...!!!

భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.రోజు రోజుకూ కరోన కేసులు పెరిగిపోవడంతో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా నమోదు అవుతోంది.

దాంతో ప్రపంచ దేశాలు భారత్ లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాయి.మీకు అండగా మేము ఉన్నామంటూ సాయం అందిస్తున్నాయి.

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు తాజాగా భారత్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని వ్యాక్సిన్ తయారికి కావాల్సిన ముడి సరుకును త్వరలో అందజేస్తామని అమెరికా విదేశాంగశాఖామంత్రి ప్రకటించారు.

అయితే భారత్ లో పరిస్థితులు రోజు రోజుకు మారితున్న క్రమంలో తక్షణమే భారత్ కు సాయం అందించాలని అమెరికా స్టోర్ రూమ్స్ లో మూలుగుతున్న మిగిలిపోయిన వ్యాక్సిన్ లు భారత్ కు ఇవ్వాలని భారత సంతతి ఎన్నారైలు బిడెన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ మేరకు ఇండో అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ మెంబర్ అయిన అమెరికా చట్టసభల సభ్యుడు రాజా కృష్ణ మూర్తి అధ్యక్షుడు బిడెన్ ను కోరారు.

రాజా కృష్ణ మూర్తి మాట్లాడుతూ.భారత్ లో పరిస్థితులు విషమంగా ఉన్నాయని, ప్రజల ప్రాణాలను కాపాడటానికి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

గిడ్డంగులలో మూలుగుతున్న మిగిలిపోయిన వ్యాక్సిన్ లను భారత్ కు ఇవ్వాలని కోరారు.అలాగే భారత్ తో పాటు కరోనా వలన ఇబ్బందులు పడుతున్న వివిధ దేశాలకు వ్యాక్సిన్ అందించాలని ఆయనా దేశాల ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం మనకు ఉందని అన్నారు.

అమెరికాలో ప్రస్తుతం 40 మిలియన్ డోసులు ఆస్ట్రేజెనికా వ్యాక్సిన్ లు ఉన్నాయని ప్రస్తుతం వాటిని వినియోగించని కారణంగా భారత్ కు ఆ వ్యాక్సిన్ లు అందించాలని కోరారు.

డెమోక్రటిక్ పార్టీ కీలక సభ్యుడిగా పలు పదవులు చేపట్టిన రాజా కృష్ణమూర్తి గతంలో భారత సరిహద్దులలో చైనా ఆగడాలను కట్టడి చేసేలా అమెరికా చట్టసభలో తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గేలా చేశారు.

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. జేడీఎస్ ఆదేశాలు