Indiramma House Scheme : భద్రాద్రిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం..: మంత్రి పొంగులేటి
TeluguStop.com
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Minister Ponguleti Srinivas Reddy ) సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రజలు ఆశించిన మేరకు పరిపాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.రెవెన్యూ సెక్టార్( Revenue Sector ) లో అవినీతి పూర్తిగా అంతరించాలని ఆయన పేర్కొన్నారు.
భద్రాచలంలోని రాములవారి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని( Indiramma House Scheme ) త్వరలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభిస్తారని వెల్లడించారు.
ఈ క్రమంలో ప్రజలకు మంచి చేసే విధంగా అధికారులు ముందుకు వెళ్లాలని సూచించారు.
టీఎస్పీఎస్సీ( TSPSC ) ద్వారా పారదర్శకంగా నియామకాలు చేపడతామని తెలిపారు.ఇప్పటికే సుమారు 22 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి పొంగులేటి ఎన్నికల కోడ్ కు ముందే పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.
వట్టి చేతులతో రాకాసి బల్లిని పట్టుకున్న మహిళ.. చివరికి ఏమైందో చూస్తే షాకే..