కోరిన కోరికలు తీర్చే ఇందిరా.. ఏకాదశి రోజు ఏ దేవుని పూజించాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ 10వ తేదీన ఇందిరా ఏకాదశి రోజు( Ekadashi Day ) ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణడిని( Srimannarayana ) పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే సకల కష్టాలు తొలగిపోతాయని పురాణాలలో ఉంది.ఈ ఇందిరా ఏకాదశి విశిష్టత గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వెల్లడించారు.

శ్రీ మహావిష్ణువు ( Shri Mahavishnu )రూపమైన శాలిగ్రామాన్ని ఇందిరా ఏకాదశి రోజు పూజిస్తారని పండితులు చెబుతున్నారు.

ఈ సారి ఇందిరా ఏకాదశి వ్రతం మంగళవారం రోజు నిర్వహిస్తారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజు భక్తులు విష్ణువు అపారమైన అనుగ్రహాన్ని పొందుతారని విశ్వసిస్తారు.

"""/" / అలాగే మనిషి జనన మరణ బంధాల నుంచి కూడా విముక్తి పొందుతాడు.

ఈ వ్రతమును శ్రీ హరినీ ఆచారాల ప్రకారం పూజించాలి.ఒక సారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పాలనకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి?ఈ వ్రత పాలన వల్ల కలిగే లాభాలు ఏమిటి అని ప్రశ్నించాడు.

అలాగే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు( Lord Krishna ) ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.

ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి.దీనిని విధిగా పాటించడం ద్వారా మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు.

అంతే కాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయని శ్రీకృష్ణుడు తెలిపాడు.అలాగే పితృపక్షంలో పేద బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణతో సంతృప్తి పరచాలి.

ముఖ్యంగా చెప్పాలంటే తర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి.అంతే కాకుండా ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాప ముక్తుడై చివరకు విష్ణు పదాన్ని చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు.

టాలీవుడ్ హీరోలపై బోల్డ్ కామెంట్ చేసిన నటి భూమిక.. ఏమన్నారంటే?