పూర్వికుల ఆత్మకు శాంతి కలగాలంటే ఈ రోజు ఇలా చేయండి..!

హిందువు ధర్మం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశి తిధులు వస్తాయి.

ప్రతి ఒక్క ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుకు( Srimaha Vishnu ) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి( Indira Ekadashi ) అని అంటారు.

ఈ సమయంలో పితృపక్షాలను జరుపుకుంటారు.ఈ ఏకాదశినీ పితృపక్షాలలో జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులభం అవుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

"""/" / ఈ పవిత్రమైన రోజున పూర్వికులను( Ancestors ) స్మరించుకుంటూ పూజలు చేయడం వల్ల వారికి విముక్తి, వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు.

పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజు పూజలు చేయాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు.

ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏకాదశి తిధి అక్టోబర్ 10వ తేదీ రోజు వచ్చింది.

ఈ ఏకాదశి తిధి రోజు పూర్వీకుల విముక్తిని కోరుకుంటూ దేవతల ముందు దీపం వెలిగించి భగవద్గీతను( Bhagavadgita ) చదవడం లేదా వినడం లాంటి పవిత్రమైన పనులను చేయాలి.

"""/" / అలాగే భగవద్గీత మొత్తం చదవడం సాధ్యం కాకపోతే కనీసం ఏడవ అధ్యాయం అయినా చదవాలని పండితులు చెబుతున్నారు.

పూర్వీకుల విముక్తి కోరుకుంటూ దేవుడిని ఆరాధించాలి.సాయంత్రం వేళ తులసి చెట్టు( Tulsi Tree ) ముందు నేతి దీపం వెలిగించాలి.

ఆ తర్వాత పూర్వీకుల విముక్తి కోసం ప్రార్థించండి.ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవాలా నూనెతో దీపాలు వెలిగించాలి.

ఇలా చేయడం వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలగడం తో పాటు మనకు ఎదురయ్యే సమస్యలు కూడా దూరమవుతాయి.

ఇంకా చెప్పాలంటే విష్ణు సహస్ర నామం పాటించడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు దూరమైపోతాయి.

అలాగే మీరు చేసే ఏ ముఖ్యమైన పని లో అయినా కచ్చితంగా విజయం సాధిస్తారు.

మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు.. జయం రవి భార్య కామెంట్స్ వైరల్!