ఇండిగో సరికొత్త నిర్ణయం.. టికెట్ బుకింగ్‌లో అందుబాటులోకి ఏఐ సేవలు

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)( Artificial Intelligence ) పేరు వినిపిస్తోంది.

పలు సంస్థలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు వినియోగించుకుంటున్నాయి.తమ యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో అనేక విమానయాన సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత పరిష్కారాలను ఉపయోగిస్తున్నాయి.

కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల పనిభారాన్ని తగ్గించడానికి, సహజ భాషలో టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి సహాయపడే ఏఐ చాట్‌బాట్‌లను ఉపయోగించడం ప్రారంభించినట్లు ఇండిగో సోమవారం తెలిపింది.

"""/" / '6 ఎస్కై( 6Eskai )' పేరుతో ఇండిగో సంస్థ ఏఐ ఆధారిత చాట్ బాట్ అమల్లోకి తీసుకొచ్చింది.

దీని వల్ల ఇంగ్లీషు, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ మనం సంభాషించవచ్చు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ ఇలా 10 భారతీయ భాషల్లో అది సమాధానం ఇస్తుంది.

ఇప్పటి వరకు ఏ ఇతర ఎయిర్ లైన్ సంస్థలు ఇలాంటి ఏఐ చాట్ బాట్‌ను తీసుకు రాలేదు.

"""/" / విమాన ప్రయాణాలు చేసే సమయంలో టికెట్ బుకింగ్‌కు ఒక్కోసారి దేశీయ ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు.

వారికి మాతృభాషలో ఆ టికెట్ బుకింగ్ ఉంటే కొంత సౌలభ్యంగా ఉంటుంది.ఎక్కువ శాతం మందికి ఈ ఇబ్బంది ఉండదు.

అయితే ధనవంతులై ఉండీ కొందరు ఇంగ్లీషు భాష విషయంలో కొంత తక్కువ అవగాహన కలిగి ఉంటారు.

అలాంటి వారికి ఇండిగో ప్రారంభించిన ఏఐ టికెట్ బుకింగ్ సేవలు చాలా ఉపయోగపడనున్నాయి.

డేటా సైంటిస్టులు జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్‌లను పరిశోధించారని, మనుషుల భావోద్వేగాలకు ప్రతిస్పందించడానికి, సంభాషణలలో హాస్యాన్ని కూడా నింపడానికి విస్తృతమైన ప్రాంప్ట్‌లను పరిశోధించారని ఇండిగో ప్రతినిధులు చెప్పారు.

"సాఫ్ట్ లాంచ్ నుండి ప్రారంభ ఫలితాలు కస్టమర్ సర్వీస్ ఏజెంట్ పనిభారంలో గణనీయమైన 75 శాతం తగ్గింపును సూచిస్తున్నాయి.

ఇది బాట్ యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది" అని ఇండిగో ఓ ట్వీట్‌లో పేర్కొంది.

అంటే ఇప్పుడు తెలుగులో కూడా మనం విమాన టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంది.

తర్వాత చేసే సినిమాల మీద లైట్ తీసుకుంటున్న అల్లు అర్జున్…