ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌ అంటే ఇదే!

తాజాగా ఓ కంపెనీ 109 గ్లోబల్ ఎయిర్‌లైన్స్ జాబితాను ప్రకటించగా దీనిలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

ఈ జాబితాలో ఇండియాకు చెందిన పలు సంస్థలు చోటు దక్కించుకోగా ఓ సంస్థ ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌ గా( World's Worst Airlines ) పేరు గడించింది.

ప్రపంచం నలుమూలల నుంచి 109 విమానయాన సంస్థలుపై పరిశోధన చేసిమరీ ఈ విషయాలు పేర్కొనడం విశేషం.

ఈ జాబితాలో 2 భారతీయ విమానయాన సంస్థలు ఉండడం గమనార్హం.అవి ఎయిర్ ఇండియా, ఇండిగో.

ఈ 2 ఎయిర్‌లైన్‌ల రేటింగ్‌లు ప్రత్యేకంగా లేకపోయినా, ఇండిగోకు( IndiGo Airlines ) మాత్రం బ్యాడ్ రేటింగ్ రావడంతో సదరు కంపెనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

"""/" / AirHelp Survey (యూరోపియన్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ కంపెనీ ఎయిర్‌హెల్ప్) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

109 ఎయిర్‌లైన్‌ల జాబితాలో ఇండిగో 103వ స్థానంలో నిలిచి అభాసుపాలయ్యింది.దీంతో ప్రపంచంలో చెత్త ఎయిర్‌లైన్స్ జాబితాలో 103లో నిలిచింది.

ఈ సర్వేలో ఇండిగోకు 10కి 4.80 పాయింట్లు రాగా, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్( Brussels Airlines ) 8.

12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.అయితే అత్యల్ప విమానయాన సంస్థ Tunis Air కూడా 109వ స్థానంలో నిలిచింది.

ఇదే చివరి స్థానం అని ఇక్కడ వేరే చెప్పాల్సిన పనిలేదు. """/" / ఇకపోతే ఇండిగో ఈ రేటింగ్‌ను పూర్తిగా తిరస్కరించింది.

ఈ విషయమై ఇండిగో విడుదల చేసిన ప్రకటనలో భారతదేశానికి అత్యంత ఇష్టమైన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.

దీంతోపాటుగా ప్రపంచ విమానయాన పరిశ్రమ ఉపయోగించే పద్ధతులు లేదా పరిహారం మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని అనుమానించింది.

అందుకే దీని విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పింది.ఇండిగో ఎల్లప్పుడూ టైమ్-టేబుల్, కనీస కస్టమర్ ఫిర్యాదుల పరంగా బాగా పని చేస్తుందని సదరు సంస్థ చెప్పుకొచ్చింది.

అక్టోబర్ 2024లో DGCA విడుదల చేసిన డేటా ప్రకారం ఇండిగో భారతదేశంలో అత్యంత సమయానుకూల విమానయాన సంస్థగా ప్రకటించడం కొసమెరుపు.

ప్రస్తుతం స్టార్ హీరోలకు ధీటుగా ఉన్న స్నేహితుడు ఆర్టిస్ట్.. ఈ నటుడిని గుర్తు పట్టారా?