భారత్ లో మొదలైన గ్లాస్ బ్రిడ్జ్.. ఎంత అందంగా ఉందో..

గాజు గ్లాసు బ్రిడ్జి ఇది వరకు మనము చైనా దేశంలో ఉందని పలుమార్లు విన్నాం.

బీహార్ రాష్ట్రంలో( Bihar ) ఓ గాజు వంతెన ఉందని మీకు తెలుసా.

? దానిని సందర్శిస్తే ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి వస్తుందని ఎప్పుడైనా విన్నారా.? ఇకపోతే ఈ గ్లాసు బ్రిడ్జ్( Glass Bridge ) గురించి చెప్పాలంటే ఇది బీహార్ రాష్ట్రంలోని రాజ్ గిరిలో నిర్మాణం జరిగింది.

ఈ వంతెన పైనుండి చుట్టుపక్కన ఉన్న అడవి అందాలని ఎంజాయ్ చేయవచ్చు.అడవి మధ్యలో నిర్మించారు.

ఈ వంతెన భారతదేశంలో రెండవ అతిపెద్ద గాజు వంతెన.ఇక ఈ వంతెన సందర్శించడం చాలా థ్రిల్లింగ్ అనుభూతి కలుగుతుంది.

"""/" / ఈ గాజు గ్లాసు బ్రిడ్జి 6 అడుగుల వెడల్పు 85 అడుగుల పొడవు గల వంతెన 200 అడుగుల ఎత్తులో నిర్మించారు.

ఈ వంతెనపై ఒకేసారి 40 మంది ప్రయాణికులు నడవవచ్చు.ఇక్కడ బ్రిడ్జిపై నిలబడి ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.

ఈ బ్రిడ్జినీ 2021లో మొదలుపెట్టారు.ఇక ఈ గాజు వంతెనను సందర్శించడానికి ప్రతి ఒక్కరికి 200 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ టికెట్ కోసం సంబంధిత సైటును సందర్శించడం ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్రిడ్జికి చేరుకోవాలంటే పాట్నా నుండి నేరుగా ఆ ప్రాంతానికి రోడ్డు రవాణా ద్వారా బస్సులు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

"""/" / ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వంతెనను వీక్షించడానికి సందర్శకులను అనుమతిస్తారు.

ఈ బ్రిడ్జితో పాటు ఈ ప్రాంతం దరిదాపుల్లో స్వర్ణగిరి, వైభవగిరి, నిపుల్ గిరి, ఉదయగిరి, రత్నగిరి అనే ఐదు అందమైన కొండలు కూడా ఉన్నాయి.

అంతేకాదు చుట్టుపక్కల ఉండే వైల్డ్ లైఫ్ సఫారీలను( Wild Life Safari ) కూడా మనం ఎంజాయ్ చేయవచ్చు.

ఈ ప్రయాణంలో రాజ్ గిర్ రోప్ వే( Rajgir Ropeway ) ద్వారా శాంతిస్తూపం దేవాలయానికి వెళ్ళవచ్చు ఈ సమయంలో అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.

దుబాయ్: 5-స్టార్ రిసార్ట్ బాల్కనీలో బట్టలు ఎండేసిన ఇండియన్ మహిళ.. చివరికి?