7 శాతంగా భారత వృద్ధి రేటు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా వెళ్లారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు దాదాపు 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.

2023 సంవత్సరంలో సమర్పించే సాధారణ బడ్జెట్ ను అదేవిధంగా తయారు చేయాల్సి ఉంటుందని అన్నారు.

మోదీ ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యతలలో వృద్ధి ఒకటి అని, కరోనా నుంచి భారత ఆర్థిక వ్యవస్థ బయటపడిన వేగాన్ని కొనసాగించడంపై శ్రద్ధ చూపుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించాలన్న ఆమె.ద్రవ్యోల్బణం కట్టడికి కూడా బడ్జెట్ ద్వారా కృషి చేస్తామని తెలిపారు.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుందా..?