సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
TeluguStop.com
సూదిలేని టీకాకు ఓకే.జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ గ్రీన్సిగ్నల్.
అత్యవసర అనుమతులు ఇవ్వాలంటూ డీసీజీఐకి సిఫార్సులు. తొలి డీఎన్ఏ ఆధారిత టీకా.
రెండువ స్వదేశీ వ్యాక్సిన్.మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
గుజరాత్ కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాలు నిపుణుల కమిటీ ఓకే చెప్పింది.
ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి సిఫార్సు చేసింది.
అదే సమయంలో రెండు మోతాదుల నియమావళి కోసం అదనపు డేటా సమర్పించామని క్యాడర్ సంస్థను నిపుణుల కమిటీ కోరింది.
జైకోవ్-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం క్యాడిలా జులై 1వ తేదీన దరఖాస్తు చేసుకుంది.
దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డీసీజీఐ సిఫార్సు చేసినట్లు సమాచారం. 27 వేల మంది వాలంటీర్ల పై నిర్వహించిన చివరిదశ ట్రైయల్స్ లో 66.
6 శాతం సమర్ధత ఉన్నట్లు మధ్యతర పరిశీలనలో తేలింది.మొత్తంగా 50 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి.
12 ఏళ్ళ పైబడిన వెయ్యి మంది పిల్లల్లోనూ పరీక్షించారు. """/" /
డిఎన్ఏ సాంకేతికతో జైడిన్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది.
ఇది మూడు డోసుల టీకా.ఇది ఒక ఇంట్రాడెర్మల్ వ్యాక్సిన్.
ఇది సూదిలేని రసాయన ఇంజెక్టర్ గా ఉపయోగించి అప్లయ్ చేయాలి.దుష్పలితాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని తయారీదారు చెప్పారు.
అనుమతులు వచ్చాక ఏటా 24 కోట్ల డోస్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
జైకోవ్-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది.
డీసీజీఐ అనుమతులు మంజూరు చేస్తే.దేశంలో అందుబాటులోకి వచ్చే రెండవ స్వదేశీ టీకాగాను మొత్తంగా ఆరో టీకాగాను నిలుస్తుంది.
కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాల పంపిణీ జరుగుతుండగా అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల అత్యవసర అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
జేసీ దూకుడు పై చంద్రబాబు సీరియస్ .. వార్నింగ్