“ఇండియా డర్టీయస్ట్ కంట్రీ”.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఫారినర్లు..
TeluguStop.com
ప్రస్తుతం ఇండియా( India ) ఇతర దేశాల కంటే చాలా రంగాలలో ముందు ఉంది.
భారతీయులు చాలా ప్రతిభావంతులు.ప్రపంచంలో రాణిస్తున్న అనేక కంపెనీలలో మన భారతీయులే నడిపిస్తున్నారు.
ప్రజలు హాయిగా కాకుండా తింటూ నివసించడానికి ఇండియా ఒక ఉత్తమమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.
శాంతిని కోరే ఇండియా ఏ విధంగా చూసుకున్నా గొప్పదే.ఈ విషయం తెలియని కొంతమంది ఫారినర్లు భారత్ గురించి తక్కువగా, చులకనగా అంచనా వేస్తుంటారు.
ఇటీవల కూడా అదే జరిగింది.ఇది చాలామంది ఇండియన్ నెటిజన్లకు కోపం తెప్పించింది.
అసలేం జరిగిందంటే ఇటీవల ఒక వ్యక్తి కొంతమందిని ఇంటర్వ్యూ చేసి, "ప్రపంచంలో అత్యంత మురికి దేశం ( Dirtiest Country ) ఏది?" అని అడిగాడు.
ఆశ్చర్యకరంగా, చాలామంది భారతదేశం అని జవాబిచ్చారు.ఈ జవాబు చాలామందికి తీవ్రమైన ఆగ్రహం కలిగించింది.
"""/" /
బ్రాండన్ ఎలాబోర్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో కనిపించింది.
ఇంటర్వ్యూయర్ రోడ్డు మీద ఉన్న వ్యక్తులను ప్రపంచంలోనే డర్టీయస్ట్ కంట్రీ ఏది అని అడిగాడు.
చాలామంది వెంటనే భారతదేశం అని చెప్పారు.కొంతమంది ఇంగ్లాండ్, ట్యూనిషియా వంటి కొన్ని ఇతర దేశాల పేర్లు కూడా చెప్పారు.
అయితే ఇండియా పేరు చెప్పిన వారు ఎక్కువ మంది ఉన్నారు.భారతీయులు ఈ వీడియోకు వెంటనే స్పందించారు.
చాలా మంది అభిమానులు కోపంతో కామెంట్ సెక్షన్‌లో భారతదేశాన్ని ప్రశంసించారు.కొంతమంది భారతీయులు, "మీరు ఇలా ఎలా చెప్పగలరు? మీరందరూ ఇక్కడికి ఆహారం కోసం వచ్చి బతిమిలాడతారు కదా?" అని అన్నారు.
మరికొందరు, "మీకు ఏమైంది? భారతదేశాన్ని ఒక్క సారైనా సందర్శించారా? మీరు సందర్శించి ఉంటే, ఇలా మూర్ఖంగా మాట్లాడరు" అని అన్నారు.
"""/" /
మరొకరు, "భారతదేశం గురించి ఇలా చెప్పిన వారికి మెదడు లేదు.
భారతదేశం అద్భుతమైన, అందమైన, ప్రత్యేకమైన దేశం" అని కామెంట్ చేశారు."భారతదేశాన్ని గౌరవించండి.
ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామం భారతదేశంలో ఉందని వారికి తెలియదు" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్, " పేర్కొన్నాడు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
రోజు ఉదయం ఈ జ్యూస్ తాగితే రక్తహీనత నుంచి బలహీనత వరకు అన్ని సమస్యలు పరార్!