యూరప్ అమెరికా నుంచి వెనక్కి వచ్చేస్తున్న భారతీయులు..!!

కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను , వారి కలలను చిద్రం చేసింది.

ఊహించని విధంగా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.వ్యాపారాలు, ఉద్యోగాలు ఇలా ఎన్నో వ్యవస్థలపై కరోనా మహమ్మారి ప్రభావం కనపడింది.

దాంతో ఉపాది కల్పించే ఎన్నో సంస్థలు మూతబడ్డాయి.ఉద్యోగాలు లేకపోవడంతో అల్లాడిపోయారు.

కాస్తో కూస్తో తగ్గుముఖం పట్టిందికదా అని భావించిన వారందరికీ కరోనా సెకండ్ వేవ్ దాదాపు అన్ని దేశాలలో మొదలవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఎంతో మంది ప్రజలు.

ముఖ్యంగా విదేశాలలో ఉద్యోగ, విద్యా , వ్యాపారం కోసం వెళ్ళిన వలస వాసుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.

కరోనా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో యూరప్ అమెరికా దేశాలు అల్లల్లాడి పోతున్నాయి.

అక్కడ ఉంటున్న వలస వాసులపై ఈ ప్రభావం పడుతోంది.ఆయా దేశాలు అక్కడ ఉంటున్న వలస వాసులను వారి వారి స్వస్థలాలకు పంపుతున్నాయి.

మరొక విషయం ఏమిటంటే అక్కడ నేరాలకు పాల్పడి జిల్లాలో ఉంటున్న విదేశీయులను సైతం వారి వారు సొంత దేశాలకు పంపెస్తున్నారు.

ప్రతీ రోజు హైదరాబాద్ కు దేశ విదేశాల నుంచీ సుమారు 11 అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి.

వాటిలో సుమారు రోజుకు 2 వేల మంది ప్రయాణికులు వస్తున్నారు.అయితే """/"/ ఇలా విదేశాల నుంచీ వచ్చే వారిలో దాదాపు అందరూ కరోన లేదనే సర్టిఫికెట్ తో వస్తుండగా వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు చేసిన తరువాత వారి వారి ప్రాంతాలకు వెళ్ళే అవకాశాన్ని కలిపిస్తున్నారు.

ఇదిలాఉంటే ఇలా గంప గుత్తంగా భారతీయులు విదేశాల నుంచీ స్వదేశాలకు రావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్దంగా లేరని, రోజుకు లక్షలాది మందికి కరోనా పరీక్షలు చేసి వారిని చూసుకోవడం స్థానిక ప్రభుత్వాలకు సవాలుగా మారడంతోనే విదేశీయులను వారి స్వదేశాలకు పంపేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి అలజడులు సృష్టిస్తోందో వేచి చూడాలి.

వైరల్ వీడియో: ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..