ఆస్ట్రేలియా పౌరసత్వం: అగ్రస్థానంలో భారతీయులు, గతేడాది కంటే 60 శాతం పెరుగుదల
TeluguStop.com
విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు క్రమక్రమంగా అక్కడి సమాజంలో కలిసిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు.
తాజాగా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందడంలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు.2019- 2020 సంవత్సరానికి సంబంధించి తమ దేశ పౌరసత్వం పొందిన విదేశీ పౌరుల జాబితాను ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
అధికారిక లెక్కల ప్రకారం 2019-2020 సంవత్సరానికి గాను 2 లక్షల మంది విదేశీ పౌరులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వగా.
ఇందులో భారతీయుల వాటా 38,209.ఇది గతేడాదితో పోలిస్తే 60 శాతం అధికం.
మన తర్వాతి స్థానంలో బ్రిటన్ జాతీయులు 25,011, చైనీయులు 14,764, పాకిస్తానీయులు 8,821 మంది వున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన వారికి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
పౌరసత్వంతో వచ్చిన హక్కులను వినియోగించుకుంటూ పౌరుడిగా బాధ్యతలను కూడా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
2016 గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 6,19,164 మంది భారత సంతతి ప్రజలున్నారు.
వీడియో: హార్దిక్ పాండ్య ఇదేం సిగ్గులేని పని.. నివాళి సమయంలో నవ్వుతావా..?