క‌రోనా విజృంభిస్తున్న వేళ ఆ యాప్‌పై ఎగ‌బ‌డుతున్న భార‌తీయులు!!

ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌.ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రోజులు త‌ర‌బ‌డి ప్ర‌పంచ‌దేశాలు లాక్‌డౌన్ విధించినా అదుపులోకి రాని క‌రోనాకు.వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు.

దీంతో అడ్డు అదుపు లేకుండా దేశ‌దేశాల్లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది.ఇక ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు.

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఇంటికే ప‌రిమితం అయిన ప్ర‌జ‌లు ముఖ్యంగా భార‌తీయులు ఓ యాప్‌ను తెగ వాడేస్తున్నార‌ట‌.

అదే ‘క్వాక్ క్వాక్’ దేశీయ డేటింగ్ యాప్.ఆడ మగ పెళ్లికాకుండానే కలిసి ఉండడం.

నచ్చితే పెళ్లి చేసుకోవడం, న‌చ్చ‌క‌పోతే విడిపోవ‌డం ఈ డేటింగ్ పరమార్థం.ఇటీవ‌ల కాలంలో యువత డేటింగ్స్ యాప్స్ లోనే జీవితం గడిపేస్తున్నారు.

"""/"/ అంద‌మైన ఫోటోల‌ను డేటింగ్ యాప్‌లో అప్ లోడ్ చేయడం.నచ్చిన పార్ట్ నర్ కోసం వెతక‌డం.

చాలా మంది ఇదే ప‌నిగా పెట్టుకుంటున్నారు.ముఖ్యంగా ఈ కరోనా లాక్ డౌన్ వేళ క్వాక్ క్వాక్ అనే డేటింగ్ యాప్‌పై భార‌తీయులు ఎగ‌బ‌డుతున్నార‌ట‌.

దీంతో ఈ డేంటిగ్‌ యాప్ లో భారత యూజర్ల సంఖ్య ఏకంగా కోటి దాటింద‌ని తాజాగా కంపెనీ ప్ర‌క‌టించింది.

అది కూడా క‌రోనా లాక్ డౌన్ వేళనే దాదాపు ప‌ది లక్షల మంది ఈ యాప్ లో చేర‌డం ఆసక్తి రేపింది.

అంతేకాదు, ప్రతీరోజు ముప్పై లక్షల ప్రొఫైల్ వ్యూస్ వస్తున్నాయని కంపెనీ వ్యవస్థాపకుడు రవి మిట్టల్ పేర్కొన్నారు.

కాగా, ఇప్ప‌టికే టిండర్, హ్యాపెన్, బంబుల్, ఓకే క్యూపిడ్ ఇలా ఎన్నో డేటింగ్ యాప్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు