అమెరికా: రాజకీయాలు, ఉన్నత పదవుల్లోనే కాదు.. సంపాదనలోనూ భారతీయులదే ఆధిపత్యం

విద్య, వ్యాపారం, ఉద్యోగాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు ఇప్పుడు అగ్రరాజ్యంలో వ్యవస్థలను శాసించే స్థాయికి ఎదిగారు.

కష్టపడే తత్వం, నలుగురిని కలుపుకునిపోయే మనస్తత్వం కారణంగా మనోళ్లు ఏ రంగలోకి వెళ్లినా దూసుకుపోతున్నారు.

అందుకే అగ్రరాజ్యంలో స్థిరపడిన మిగిలిన దేశస్థుల కంటే భారతీయులు అధిక ఆదాయం సాధిస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు.

ఏటా ఫెడరల్ ప్రభుత్వం నిర్వహించే అమెరికన్ కమ్యూనిటీ సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వివరాల ప్రకారం.అమెరికాలో స్థిరపడ్డ అమెరికన్ల ఆదాయం ఏటా అందిరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది.

మన తర్వాతి స్థానంలో ఫిలిప్పిన్స్ 83,300, తైవానీస్ 82,500, శ్రీలంకన్ 74,600, జపనీస్ 72,300, మలేసియన్ 70,300, చైనీస్ 69,100, పాకిస్తానీయులు 66,200, శ్వేత జాతి అమెరికన్లు 59,900, కొరియన్లు 59,200 ఉన్నారు.

వ్యాపారపరంగా సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అజయ్ బంగా, ఇంద్రా నూయి, అరవింద్ కృష్ణ, లక్ష్మీ నారాయణన్ వంటి వారు దిగ్గజ సంస్థలకు సారథులుగా వ్యవహరిస్తూ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

కమలా హారిస్, అమీ బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, దాలిప్ సింగ్, నిక్కీ హేలీ వంటి వారు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.

కెనడా : భారతీయ దౌత్యవేత్తలే టార్గెట్.. మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన