ఇండియన్స్ కొన్ని వింతైన విషయాలలో గిన్నిస్ రికార్డులకెక్కారు... అవేమిటంటే?

గిన్నీస్ రికార్డులు అనేవి ప్రతి సంవత్సరం రికార్డు చేయబడతాయి.అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను ఇందులో నమోదు చేస్తారు.

ఇందులో అనేకమంది సాధించిన ఘన విజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలను చేర్చుతారు.అయితే ఇదే పుస్తకం కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు రికార్డు నెలకొల్పడం విశేషం.

అంత ప్రత్యేకత కలిగిన గిన్నిస్ బుక్ లో రికార్డు నెలకొల్పాలని సంవత్సరాలపాటు శ్రమిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేకమంది ఇందులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.మరెంతమందో దానికోసం కష్టపడుతున్నారు.

ఇకపోతే మన ఇండియానుండి గిన్నిస్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న క్రేజీ సంగతులు ఇపుడు మనం చూద్దాము.

శ్రీ జలరాం మందిర్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అతిపెద్ద చపాతి చేసి గిన్నిస్ రికార్డ్స్ కెక్కారు.

ఇతగాడు ఆ చపాతీ తయారు చేయడానికి రెండు రోజులు కష్టపడ్డాడని తెలుస్తోంది.అలాగే వనిశా మిట్టల్ పెళ్లి ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా పరిగణిస్తారు.

దాంతో అతడు కూడా లిస్ట్ లో వున్నాడు.ఇక ప్రపంచంలోని భారీగా బిర్యానీ తయారు చేసిన బృందం ఇండియన్ చెఫ్ గ్రూప్ వారు ఒకేసారి 1200 కిలోల బిర్యానీ తయారు చేసి గిన్నిస్ రికార్డ్స్ బ్రేక్ చేసారు.

అలాగే పొడ వైన వెంట్రుకలు కలిగిన ఓ టీనేజర్ వుంది.ఆమె పేరు నీలాంషీ పటేల్.

ఆమె జుట్టు పొడవు సుమారు ఆరు అడుగులు.ప్రపంచంలోనే పొడవైన తలపాగా ధరించినవారిగా అవతార్ సింగ్ ని చెప్పుకుంటారు.

అది సుమారు 100 పౌండ్ల బరువు ఉంటుంది.ఇక ప్రపంచంలోనే పొడవైన గోళ్లు కలిగిన వ్యక్తిగా శ్రీధర్ చిల్లాల్ కి పేరు వుంది.

ఈ వరుసలోనే అతి పొడవైన మీసం - రామ్ సింగ్ చౌహాన్; అతి పెద్ద లడ్డు - పొలిశెట్టి మల్లికార్జున రావు; ప్రపంచంలోనే అతిపొట్టి మహిళ - జ్యోతి ఆమ్గే లిస్టులో వున్నారు.

అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్…. బ్లాక్ బస్టర్ కావడం పక్కా?