ఈ దేశాల నుంచి వచ్చే ఇండియన్స్ యూపీఐ పేమెంట్స్‌ జరపవచ్చు..!!

భారతదేశానికి వచ్చే విదేశీ సందర్శకులు డిజిటల్ ట్రాన్సాక్షన్ల కోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించుకోవచ్చని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది.

యూపీఐ ఫెసిలిటీని G20 దేశాల నుంచి వచ్చే సందర్శకుల కోసం నిర్దిష్ట అంతర్జాతీయ విమానాశ్రయాలలో మాత్రమే ప్రారంభించింది.

యూపీఐ అనేది ఇండియాలో బాగా ఉపయోగించే ఒక డిజిటల్ పేమెంట్ మెథడ్. """/"/ తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ యూపీఐ ఇండియాలో ఉన్న అన్ని ఇన్‌బౌండ్ ప్రయాణికులు దేశంలో ఉన్నప్పుడు వారి వ్యాపారి చెల్లింపుల (P2M) కోసం యూపీఐని ఉపయోగించడానికి అనుమతించాలని ప్రతిపాదించింది.

క్యాష్ తీసుకెళ్లడం లేదా కరెన్సీని మార్చుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా విదేశీ సందర్శకులు సులభంగా కొనుగోళ్లు చేయడానికి ఇది సహాయపడుతుంది.

ఈ చర్య భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచుతుందని అన్నారు. """/"/ ఇకపోతే ఇంతకుముందు పది దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు లేదా ఎన్‌ఆర్‌ఐలు లావాదేవీల కోసం తమ ఇండియా ఫోన్ నంబర్‌పై ఆధారపడకుండా యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చని గత నెలలో కేంద్రం ప్రకటించింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరింత మంది వ్యక్తులు యూపీఐని ఉపయోగించడానికి, డిజిటల్ లావాదేవీలను అందరికీ సులభతరం చేయడానికి ఈ మార్పులను చేసింది.

ఈ మార్పులతో యూపీఐ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మరింత అందుబాటులోకి వస్తుంది.

వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతుంది.

మాంసాహారంపై నిమ్మ‌ర‌సం పిండి తీసుకోవ‌చ్చా?