ఫెడెక్స్ ఘటనలో నేల రాలిన భారతీయులు...!!!
TeluguStop.com
అమెరికాలో ని ఇండియానాలో ఉన్న ఫెడెక్స్ కొరియర్ సంస్థ వద్ద జరిగిన కాల్పుల ఘటన అమెరికన్స్ ను షాక్ కు గురిచేసింది.
ఈ ఘటనలో దాదాపు 8 మంది మృతి చెందారన్న విషయం అందరికి తెలిసిందే అయితే మృతి చెందిన వారిలో భారత సంతతికి చెందిన సిక్కు లు నలుగురు ఉన్నారనే విషయం చాలా అలాస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై భారతీయ సిక్కు సమాజం ఆందోళన చెందుతోంది.భారత విదేశాంగ శాఖామంత్రి జై శంకర్ తన తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.
ఫెడెక్స్ కొరియర్ సంస్థ ఇండియానా లోని ఎయిర్ పోర్ట్ సమీపంలోనే ఉంది.గతంలో ఇదే సంస్థలో కొన్నేళ్ళ పాటు పనిచేసిన బ్రాండన్ స్కాట్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు.
తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తరువాత స్కాట్ తనని తను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
చనిపోయిన వారి పేర్లు ఇండియానా పోలీసులు వెల్లడించారు.వారిలో అమర్ జిత్ జోహళ్ , జస్విందర్ కౌర్ , అమర్ జిత్ షేఖాన్ , మరొకరు జస్వందర్ సింగ్ వీరందరూ 50 ఏళ్ళు పై బడిన వారే.
ఇదిలాఉంటే ఇండియానా లో ఉన్న ఫెడెక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 90 శాతం మంది ఇండియన్ అమెరికన్స్ ఉన్నారని ఇందులో అత్యధికంగా సిక్కు మతస్తులు ఉన్నారని తెలుస్తోంది.
ఈ ఘాతుకానికి పాల్పడిన స్కాట్ కొన్ని నెలలుగా మానసిక రుగ్మతతో భాదపడుతున్నాడని, ఇంతలో ఇంతటి దారుణానికి పాల్పడుతాడని ఊహించలేదని ఫెడెక్స్ నిర్వాహకులు తెలిపారు.
కాగా ఈ ఘటనపై సిక్కు కౌన్సిల్ ఛైర్మెన్ రజవత్ ఆందోళన చెందారు.అమెరికా అధ్యక్షుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి చెందారు.
చనిపోయిన వారికి సంతాపం తెలిపారు.
ఆ భారీ షాట్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేసిన అల్లు అర్జున్.. అదరగొట్టేశారుగా!