కెనడా నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిందేనా..?
TeluguStop.com
కొంతమంది ఇతర దేశాలకు వెళ్లేందుకు నానా కష్టాలు కష్టపడుతూ ఉంటారు.ఎలాగైనా విదేశాలకు వెళ్లి చదువుకోవాలని లేదా అక్కడ ఉద్యోగం చేసి స్ధిరపడాలని భావిస్తూ ఉంటారు.
ఇందుకోసం అనేక పరీక్షలు రాస్తూ ఉంటారు.అలాగే పాస్‌పోర్టుతో పాటు వీసా ( Visa ) తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఇందుకోసం అనేక ఏజెన్సీలను సంప్రదిస్తూ ఉంటారు.మరికొంతమంది అయితే ఎలాగైనా విదేశాలకు వెళ్లాలనే కలను సాకారం చేసుకునేందుకు అడ్డదారులు కూడా తొక్కుతూ ఉంటారు.
"""/" /
కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు( Fake Documents ) ఉపయోగించి విదేశాలు వెళుతూ ఉంటారు.
ఇలాంటివారు దొరికినప్పుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది.ఒకసారి చిక్కితే విదేశాలను వదిలి మళ్లీ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది.
ప్రస్తుతం కెనడాలో( Canada ) కొంతమంది భారతీయుల పరిస్థితి ఇలాగే ఉంది.కొంతమంది భారతీయులు ఫేక్ డాక్యుమెంట్లు ఉపయోగించి కెనడా వెళ్లారు.
ఇలా వందలమంది భారతీయులు ఫేక్ డాక్యుమెంట్లు వాడినట్లు కెనడా అధికారులు ఆరోపిస్తున్నారు.దీంతో ఫేక్ డాక్యుమెంట్లు ఉపయోగించి వెళ్లినవారు తిరిగి ఇండియాకు తిరిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
"""/" /
2016-17లో కెనడాకు వెళ్లినవారిలో చాలామంది భారతీయులు ఫేక్ డాక్యుమెంట్లు వాడినట్లు తెలుస్తోంది.
చాలామంది అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు.ఫేక్ డాక్యుమెంట్స్ తయారుచేసి వచ్చినట్లు నిర్ధారణ అయితే దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.
ఇదే జరిగితే అక్కడి భారతీయులు తిరిగి ఇండియాకు రావాల్సిందే.ఫేక్ డాక్యుమెంట్స్ వాడినందును కెనడాలో శాశ్వత నివాసాన్ని పొందలేరని కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తెలిపారు.
తమ పని నిందితులను గుర్తించడమేనని, కానీ బాధితులను శిక్షించడం కాదని ఆయన తెలిపారు.
అయితే అక్కడి భారతీయులు మాత్రం తమ తప్పు లేదని, తాము ఇక్కడికి రావడానికి సహరించిన ఏజెంట్లదే తప్పు అని చెబుతున్నారు.
కెనడాలో భారతీయ విద్యార్థుల సమస్యలపై చర్చ జరిగింది.ఈ సందర్బంగా ప్రధాని పై విధంగా వ్యాఖ్యానించారు.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?