ఆసియా క్రీడల్లో సెమీఫైనల్ కు చేరిన భారత మహిళల క్రికెట్ జట్టు..!

ఆసియా క్రీడల్లో భాగంగా తాజాగా భారత్-మలేషియా మధ్య జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

అయితే భారత జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉండడం వల్ల నేరుగా సెమీఫైనల్ కి అర్హత సాధించింది.

ఇక భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో ఉంది.

తాజాగా రద్దయిన భారత్- మలేషియా మ్యాచ్ విషయానికి వస్తే.వర్షం కారణంగా మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి మలేషియా( Malaysia ) బౌలర్లకు చెమటలు పట్టించారు.

"""/" / భారత జట్టు కెప్టెన్ స్మృతి మందాన( Smriti Mandhana ) 16 బంతులలో ఐదు ఫోర్ లతో 27 పరుగులు, షెఫాలీ 39 బంతులలో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 67 పరుగులు చేసి మలేషియా బౌలర్లను గ్రౌండ్లో పరుగులు పెట్టించింది.

వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీయా రోడ్రిగ్స్ 29 బంతుల్లో ఆరు ఫోర్లతో 47 పరుగులు, రిచా ఘోష్ ఏడు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ తో 21 పరుగులు చేయడంతో భారత జట్టు 174 పరుగుల భారీ టార్గెట్ ని మలేషియా జట్టుకు విధించింది.

అనంతరం లక్ష్య చేదన కు మలేషియా జట్టు రెండు బంతులు ఆడగానే మరోసారి వర్షం అంతరాయం కలిగించింది.

వర్షం క్రమంగా పెరిగి భారీగా కురవడం వల్ల మ్యాచ్ ఆడేందుకు సాధ్యపడలేదు.దీంతో మ్యాచ్ అయింది.

"""/" / భారత్( Indian ) నేరుగా సెమీఫైనల్ కి చేరింది.సెప్టెంబర్ 24న మహిళల క్రికెట్ సెమీఫైనల్ మ్యాచులు జరుగుతాయి.

సెమీ ఫైనల్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి జట్టు ఎవరో చూడాల్సి ఉంది.

2025 లో మెగా హీరోలు తమ సత్తా చాటబోతున్నారా..?