ఇంగ్లాండ్ లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ...!!!

భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే తమ ఉనికిని చాటడంలో వారి అత్యద్భుతమైన ప్రతిభాపాటవాల ద్వారా ఆయా దేశాల మన్ననలు పొందటంలో ముందుంటారు.

ఈ విషయంలో ఏ దేశం కూడా మన భారతీయులతో పోటీ పడలేకపోతోందంటే అతిశయోక్తి కాదు.

భారతీయులు సగర్వంగా తలెత్తుకునేలా ఇప్పటికే ఎంతో మంది భారతీయులు విదేశీ గడ్డపై అనేక కీలక పదవులలో కొలువుదీరి ఉన్నారు.

తాజాగా.ఇంగ్లాండ్ లో భారత సంతతికి చెందిన ఓ మహిళ కు అరుదైన గౌరవం లభించింది.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు చేసే కమిటీలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ స్వాతి దింగ్రా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

అంతేకాదు ఈ కమిటీలో ఎన్నికయిన మొట్టమొదటి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.ఇంతకీ ఎవరీ స్వాతి దింగ్రా భారత్ లో పుట్టిన స్వాతి ఢిల్లీ వర్సిటీలో చదువుకున్నారు.

అలాగే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచీ మాస్టర్ పట్టా పొందారు.ఆ తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, అలాగే ఇంటర్నేషనల్ ఎకామిక్స్ పొందారు.

అంతేకాదు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ నుంచీ ఏంఎస్, పీహెచ్డీ పూర్తి చేసారు.

గతంలో ఇంగ్లాండ్ ట్రేడ్ మోడలింగ్ రివ్యూ ఎక్స్పర్ట్ ప్యానల్, ఎకనామిక్స్ డిప్లమోసి ప్యానల్ లో కీలక సభ్యురాలిగా పనిచేసారు.

ప్రస్తుతం ఆమె రాయల్ మింట్ మ్యూజియం డైరెక్టర్, ది ఎకనమిక్ 2030 ఎంక్వైరీ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు.

తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఈ కీలక పదవి రావడంతో దింగ్రా సంతోషం వ్యక్తం చేసారు.

Chandra Mohan : చంద్రమోహన్‌కి వణుకు పుట్టించిన అలీ కూతురు..