14 ఏళ్లు అమెరికాలో ఉన్న మహిళ.. స్వదేశానికి వచ్చి ఏం చెప్పిందంటే..?

ఈ రోజుల్లో ఇండియన్స్ విదేశాలకు ఎక్కువగా తరలిపోతున్నారు.జాబ్, ఉద్యోగం, చదువు ఇలా కారణాలు ఏవైనా అమెరికా( America ) వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.

ఇప్పుడే కాదు చాలా ఏళ్ల క్రితం కూడా మన భారతీయులు అమెరికా వెళ్లి అక్కడ జీవనం సాగించారు.

అలాంటి వారిలో కొందరు తిరిగి స్వదేశానికి వస్తున్నారు.వారిలో అదితి ద్వివేది( Aditi Dwivedi ) కూడా ఒకరు.

అమెరికాలో 14 ఏళ్లు నివసించిన ఈ మహిళ ఇప్పుడు భారతదేశంలోని సొంత సిటీ నాగ్‌పూర్‌కి( Nagpur ) తిరిగి వచ్చింది.

తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం గురించి ఆమె పంచుకున్న వీడియో నెట్టింట వైరల్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అమెరికా, ఇండియా మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలిపింది.అదితి తన వీడియోలో నాగ్‌పూర్‌లో తన జీవితం ఆమె అంచనాలను మించిపోయిందని చెప్పింది.

ఇప్పుడు భారతదేశంలో జీవనం 20 ఏళ్ల క్రితం కంటే చాలా మారిపోయిందని, ముఖ్యంగా నాగ్‌పూర్‌లో లివింగ్ చాలా చౌకగా, సౌకర్యవంతంగా ఉందని తెలిపింది.

తన జీతంలో సగం మనీ ఆదా చేయగలుగుతున్నానని ఆమె చెప్పింది.తన తల్లిదండ్రులతో కలిసి వారి ఇంట్లోనే ఉంటున్నందున అద్దె, విద్యుత్ బిల్లు వంటి పెద్ద ఖర్చులు లేకుండా చిన్న చిన్న ఇంటి ఖర్చులు మాత్రమే చెల్లించాల్సి వస్తోందని తెలిపింది.

"""/" / అమెరికాలోని ఒక కంపెనీలో రిమోట్‌గా పని చేస్తున్న అదితి తన రోజును తానే నిర్ణయించుకునే స్వేచ్ఛను దానిని అంటోంది.

ఆమె వర్క్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.దీంతో ఉదయం సమయంలో తనకు నచ్చిన పనులు చేసుకునే అవకాశం లభిస్తుంది.

రోజూ 30 నిమిషాలు నడక, 90 నిమిషాలు యోగా చేయడంతో పాటు, తన సొంత ప్రాజెక్టులపై దృష్టి పెడుతుంది.

ఆమె ఫుల్ టైమ్‌ జాబ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

"""/" / నాగ్‌పూర్‌లో నివసించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఇంటి పనులకు పని మనుషులు సులభంగా దొరుకుతారని, రుచికరమైన ఆహారం లభిస్తుందని ఆమె చెప్పింది.

తక్కువ ట్రాఫిక్, బడ్జెట్‌కు అనుగుణంగా షాపింగ్ ఐటమ్స్ ఉండటం తనకి ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పింది.

తన తండ్రిని "పర్సనల్ షాపర్"గా ఉపయోగించుకుంటూ, ఆయనతో కలిసి షాపింగ్‌కు వెళ్తానని అదితి చెప్పుకొచ్చింది.

అదితి తన జీవితం చాలా ప్రశాంతంగా, సుఖంగా ఉందని వెల్లడించింది.చాలామంది ఎన్నారైలు తాము కూడా స్వదేశానికి తిరిగి రావాలని చూస్తున్నామని కానీ పొల్యూషన్ వల్ల భయపడుతున్నామని అంటున్నారు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న రాకింగ్ రాకేష్ కేసీఆర్.. ఇక్కడైనా హిట్టవుతుందా?