యూకే : రోడ్డు ప్రమాదంలో భారతీయ మహిళ దుర్మరణం.. నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ భారతీయ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి యూకే కోర్ట్ ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

నిందితుడు అజీజ్ దాదాపు 100 కి.మీ వేగంతో వాహనాన్ని నడిపినట్లు దర్యాప్తులో తేలింది.

వివరాల్లోకి వెళితే.గతేడాది నవంబర్‌లో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో నిందితుడు నడుపుతున్న ఆడి 3 కారు.

బాధితురాలైన బల్జిందర్ కౌర్ మూర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది.ఆ సమయంలో నిందితుడి కారు 100 కి.

మీ.బల్జీందర్ కౌర్ కారు 63 కి.

మీ వేగంతో వున్నాయి.బాధితురాలు తన సోదరుడి ఇంటి నుంచి తన భర్తను తీసుకురావడానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

విచారణ సందర్భంగా ఇద్దరు సాక్షులు అజీజ్ కారు తమను దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో దాటి వెళ్లిందని వోల్వర్‌హాంప్టన్ కోర్టుకు తెలిపారు.

ఘటనాస్థలికి 30 మీటర్ల దూరంలో శిథిలాలు చెల్లాచెదురుగా పడి వున్నాయని.కారు నుంచి ఇంజిన్ విడిపోయిందంటూ ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చని ప్రాసిక్యూటర్ కాథ్లిన్ ఆర్చర్డ్ తెలిపారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బల్జీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ప్రకటించినట్లు ఆయన కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.

"""/"/ నిందితుడు అజీజ్ వాల్సాల్‌లోని హైగేట్ డ్రైవ్‌కు చెందినవాడని పోలీసులు గుర్తించారు.విచారణలో ఈ ప్రమాదానికి బాధితురాలు బల్జిందర్ కౌరే కారణమని వాదించేందుకు తొలుత ప్రయత్నించాడు.

అయితే తన ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఆమె మరణించినట్లు అజీజ్ అంగీకరించాడు.ఈ నేరానికి గాను అతనికి ఆరేళ్ల జైలు శిక్షను విధిస్తూ మంగళవారం వోల్వర్ హాంప్టన్ క్రౌన్‌ కోర్ట్‌ తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా నిందితుడు జరిగిన దారుణానికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.అయితే అజీజ్‌పై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని, డ్రైవింగ్ నిబంధనలు ఎప్పుడూ ఉల్లంఘించలేదని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.

ఆరేళ్ల జైలు శిక్షకు అదనంగా అజీజ్‌ డ్రైవింగ్ చేయకుండా ఏడేళ్ల పాటు నిషేధం విధించింది కోర్ట్.

"""/"/ ఇకపోతే.రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడితో పాటు ఓ గర్భవతిని పొట్టనబెట్టుకున్న భారత సంతతి డ్రైవర్‌కు యూకే కోర్టు గత నెలలో 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

నిందితుడిని నితేష్ బిసెండరీ (31)గా గుర్తించారు.అతను గత ఏడాది ఆగస్ట్ 10న ఇంగ్లాండ్‌లోని రామ్‌స్‌గేట్‌లోని లియోపోల్డ్ స్ట్రీట్‌లో ప్రయాణిస్తుండగా తన ఆల్ఫా రోమియో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.

దీంతో అది రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో యోరామ్ హిర్ష్‌ఫెల్డ్ (81), అతని కుమార్తె నోగా సెల్లా (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదం జరిగే నాతటికి ఆమె నిండు గర్భిణి.ఇదే ఘటనలో కారులోనే వున్న సెల్లా భర్త , వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

తప్పుడు ప్రచారం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట..: సీఎం రేవంత్