పళ్లతోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన భారతీయ మహిళ..

భారతదేశానికి చెందిన 26 ఏళ్ల కల్పనా బాలన్( Kalpana Balan ) ఒక అరుదైన లక్షణంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్‌గా నిలిచింది.

ఈ మహిళ నోటిలో 38 దంతాలు( 38 Teeth ) ఉన్నాయి, సగటు పెద్దవారి కంటే ఆరు ఎక్కువ పళ్లు ఉండటంవల్ల ఆమె ఈ అత్యధిక దంతాలు ఉన్న మహిళగా రికార్డును సాధించగలిగింది.

కల్పనా అదనపు దంతాలు ఏదైనా దంత ప్రక్రియ లేదా ఇంప్లాంట్ ఫలితంగా రాలేదు.

అవి నేచురల్ గానే ఆమెకు వచ్చాయి.యుక్తవయస్సులో ఉన్నప్పుడు క్రమంగా పెరిగాయి.

ఈ అదనపు దంతాల వల్ల ఆమెకు ఎలాంటి నొప్పి కలగదు, కానీ ఆమె తినేటప్పుడు అవి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి, ఎందుకంటే ఆహారం తరచుగా వాటి మధ్య చిక్కుకుపోతుంది.

"""/" / కల్పనకు సాధారణం కంటే ఎక్కువ దంతాలు ఉన్నాయని గమనించిన తల్లిదండ్రులు, వాటిని తొలగించాలని సూచించారు.

అయితే, డెంటిస్ట్ వాటిని రిమూవ్ చేయడం కష్టమని, దంతాలు మరింత పెరిగే వరకు వేచి ఉండమని సలహా ఇచ్చాడు.

కల్పన డెంటల్ సర్జరీకి( Dental Surgery ) భయపడి పళ్లను అలాగే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది.

కల్పనకు ఇప్పుడు కింది దవడలో నాలుగు అదనపు పళ్లు, పై దవడలో రెండు అదనపు పళ్లు ఉన్నాయి.

ఆమె తన ప్రత్యేకమైన రికార్డు గురించి చాలా గర్వంగా ఉంది.దానిని జీవితకాల విజయంగా భావిస్తుంది.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌( Guinness World Record ) టైటిల్‌ సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆమె న్యూస్ మీడియా కి తెలిపింది.

"""/" / కల్పన భవిష్యత్తులో తన రికార్డును కూడా బద్దలు కొట్టవచ్చు, ఎందుకంటే ఆమె నోటిలో ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి, అక్కడ ఎక్కువ దంతాలు పెరుగుతాయి.

కెనడాకు చెందిన ఇవానో మెల్లోన్( Evano Mellone ) నోటిలో 41 పళ్ళు ఉన్నాయి.

అందువల్ల మగవారి పేరిట రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.సాధారణం కంటే ఎక్కువ దంతాలు కలిగి ఉండటాన్ని హైపర్‌డోంటియా లేదా పాలీడోంటియా అంటారు.

ఇది ప్రపంచ జనాభాలో 3.8% మందిని ప్రభావితం చేస్తుంది.

హైపర్‌డోంటియా కచ్చితమైన కారణం తెలియదు, అయితే ఇది దంతాల నిర్మాణ ప్రక్రియలో లోపం కారణంగా తలెత్తుతుందని నమ్ముతారు.

సాధారణ దంతాల మొగ్గ దగ్గర అదనపు పంటి మొగ్గ అభివృద్ధి చెందినప్పుడు లేదా సాధారణ దంతాల మొగ్గ రెండుగా విడిపోయినప్పుడు ఇది సంభవించవచ్చు.

వైరల్: చలికాలంలో కురాళ్లకు హీటేక్కిస్తున్న యువతి.. ఏం చేస్తోందో చూడండి!