అమెరికా: టెలీమార్కెటింగ్ స్కాంలో సూత్రధారి… భారతీయుడికి రెండేళ్ల జైలు

టెలి మార్కెటింగ్‌ స్కాంలో కీలక సూత్రధారిగా వ్యవహరించిన భారతీయ యువకుడికి అమెరికా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళితే.మనీష్ కుమార్ అనే 32 ఏళ్ల యువకుడు న్యూయార్క్ నుంచి భారత్‌కు పారిపోతుండగా ఎఫ్‌బీఐ ఏజెంట్లు 2019 ఆగస్టు 24న అతనిని పట్టుకున్నారు.

నాటి నుంచి అతను ఫెడరల్ కస్టడీలో వుంటున్నాడు.కుట్ర, మోసం, దొంగతనాలకు పాల్పడిన ఆరోపణలపై ఆయన 2020 నవంబర్ 5న మనీస్ నేరాన్ని అంగీకరించాడు.

విచారణ సందర్భంగా ఫెడరల్ కోర్టు అతనికి 24 నెలల జైలు శిక్ష విధించింది.

విడుదలైన తర్వాత మూడేళ్ల పర్యవేక్షణ వుంటుందని తెలిపింది.దర్యాప్తు సమయంలో ఎఫ్‌బీఐ.

మనీష్ మోసపూరితంగా కొట్టేసిన కొన్ని నిధులను బాధితులకు చెల్లించింది.తమ కంప్యూటర్లు మాల్‌వేర్ బారినపడ్డాయని నమ్మి.

కాల్ సెంటర్ ఆపరేటర్ల నుంచి కంప్యూటర్ ప్రొటెక్షన్ సేవలను కొనుగోలు చేసే వ్యక్తులను టార్గెట్ చేసి మనీష్ మోసానికి పాల్పడ్డాడు.

ఇతని మాయమాటలను నమ్మిన కొందరు కాల్ సెంటర్లకు ఫోన్ చేసేవారు.కుట్రలో భాగంగా ఆ కాల్ సెంటర్లు.

కంప్యూటర్లలో మాల్‌వేర్ చొరబడిందని అబద్దం చెప్పాయి.టెక్నికల్ సపోర్ట్ కోసం కొంత మొత్తం చెల్లించాల్సిందిగా ఆపరేటర్లు కోరేవారు.

ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.ఒకసారి వీరి చేతిలో మోసపోయిన వాళ్లు మరోసారి బలయ్యేవారు.

సదరు కాల్ సెంటర్ ఆపరేటర్లు బాధితులకు ఫోన్ చేసి మీరు రిఫండ్‌కు అర్హులంటూ చెప్పేవారు.

తర్వాత మీ ఖాతాలకు రిఫండ్ మొత్తానికి మించి పంపామని చెప్పి, అంతకు రెట్టింపు సొమ్మును రాబట్టేవారని అమెరికా న్యాయశాఖ తెలిపింది.

అయితే వాస్తవానికి బాధితులకు కాల్ సెంటర్ నుంచి ఎలాంటి సొమ్ము పంపబడలేదని దర్యాప్తులో తేలింది.

కుట్రలో భాగంగా కుమార్ కాల్ సెంటర్ ఆపరేటర్లకు అమెరికాలో ఒక బ్యాంక్ ఖాతాను తెరిచాడు.

ఆ ఎకౌంట్‌కు బాధితులు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేవారు.అనంతరం కుమార్ సహ కుట్రదారులకు ఆ మొత్తాన్ని పంచేవాడని దర్యాప్తులో తేలింది.

దీనితో పాటు అమెరికన్లకు చెందిన 37 క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సైతం నిందితుడు సేకరించాడు.

ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..!!